జైనూర్, ఆగస్టు1 (ప్రభన్యూస్) : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి చెందిన గైక్వాడ్ హరీష్ (28) ఉపాధి కోసం వేరే జిల్లాకు వెళ్లి గుండెపోటుతో ఇవాళ మృతిచెందినట్లు మృతుని అన్న గాయక్వాడ్ సతీష్ తెలిపారు. హరీష్ బతుకుదెరువు కోసం సిద్దిపేట జిల్లా కుక్కునూరు మండలంలోని మోడీన్పూర్ గ్రామంలో ఇటుకల బట్టిలో పనిచేసుకుంటూ ఉండేవాడని ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. కుటుంబ పోషణ కోసం పనిచేయడానికి వెళ్లి మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయమని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement