చెన్నూర్, ప్రభన్యూస్: వీసా రాలేదని మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలం కమ్మరిపల్లిలో చోటుచేసుకుంది.
చల్ల రాజేశ్వర్ రెడ్డి, సుజాత ల కుమారుడు చల్ల విష్ణు హైదరాబాద్ లోని ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కై ప్రయత్నం సాగిస్తూన్నాడు. విదేశీ విద్య ప్రయత్నంలో వీసా పొందే క్రమంలో అంతరాయాలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురై ఆత్మ హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.