Wednesday, November 20, 2024

ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు.. పల్సర్ బైకుతో వ్యవసాయం

బైంసా పట్టణానికి చెందిన పెండెపు కృష్ణమూర్తి అనే యువరైతుకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలనేది అతడి ఆలోచన. దుక్కి దున్నుడు నుంచి పంట చేతికి వచ్చే వరకు కూలీలకు, యంత్రాలకు పెట్టుబడి అధికంగా పెట్టాల్సిన పరిస్థితి. రాబడిలో సగం ఖర్చు వీటికే కేటాయించాల్సి వస్తోందని అతడు గుర్తించాడు. దీంతో శారీరక శ్రమ తగ్గేలా తక్కువ పెట్టుబడిలో వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయాలని కృష్ణమూర్తి ఆలోచన చేశాడు.

దీంతో సోషల్ మీడియాలో సెర్చ్ చేయగా రాజస్థాన్ రాష్ట్రంలో ట్రాక్టర్‌ తరహాలో పనిచేసే యంత్రాలను గుర్తించాడు. రూ.90 వేలు పెట్టుబడితో కల్టీవేటర్, సీడ్ డ్రిల్లర్, స్ప్రే మిషన్‌ను కొనుగోలు చేశాడు. వాటిని దిగుమతి చేసుకుని తన వద్ద ఉన్న పల్సర్ బైకు వెనుక భాగం తొలగించి ఆ మిషన్‌లను అమర్చాడు. దీంతో పల్సర్ కాస్తా త్రీ వీలర్ ట్రాక్టర్‌లా తయారైంది. దీనిపైనే దక్కులు దున్నడం, విత్తనాలు చల్లడం, కలుపు తీయడం, పత్తి చేలలో మందు స్ప్రే చేయడం వంటి చేస్తుండటంతో తోటి రైతులు ఆశ్చర్యపోతున్నారు. కూలీలతో పనిలేకుండా కేవలం ఒకరిద్దరు సహాయంతో వ్యవసాయం చేసుకునేలా కృష్ణమూర్తి రూపొందించిన యంత్రాన్ని చూసి తోటి రైతులు ఫిదా అవుతున్నారు.

ఇది కూడా చదవండి: సోనూసూద్ కోసం సైకిల్ యాత్ర

Advertisement

తాజా వార్తలు

Advertisement