Friday, November 22, 2024

రైతుల సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ లక్షం : ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని ముధోల్ ఎమ్మెల్యే జి.విట్టల్ రెడ్డి అన్నారు. గురువారం బాసర మండల కేంద్రంలోని ప్రాథమిక సొసైటీ గోదాం వద్ద శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. రైతుబంధు రైతు బీమా పథకాలతో పాటు ఉచితంగా 24 గంటల కరెంటు అందిస్తుండడంతో చుట్టు పక్కల రైతులు శనగ పంటను అధికంగా వేయడంతో రైతుల సంక్షేమం దృష్ట్యా దళారులకు తమ ధాన్యాన్ని అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి గిట్టుబాటు ధర పొందాలని కోరారు. క్వింటాలు శనగాలకు ప్రభుత్వం 5330 రూపాయలు మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీదరేల్లి పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, సర్పంచ్ లక్ష్మణరావు సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్లు రమేష్ రావు, నరేష్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ రామారావు, మండల పరిషత్ ఉపధ్యక్షుడు నర్సింగ్ రావు, బీఆర్ఎస్ కన్వీనర్ శ్యాంసుందర్, మాజీ ఆలయ కమిటీ సభ్యుడు బాలమల్కన్న యాదవ్, మల్లయ్య యాదవ్, తాసిల్దార్ నారాయణ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement