Saturday, November 23, 2024

అక్కలపల్లిలో నీటి కొరత..

భీమిని : మండలంలోని అక్కలపల్లి గ్రామపంచాయితీలో మిషన్‌ భగీరథ ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంతో త్రాగునీరు, ఇతర అవసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా కోసం నూతనంగా ట్యాంకులను ఏర్పాటు చేసినప్పటికీ పైప్‌లైన్లను సరైన పద్దతిలో ఏర్పాటు చేయకపోవడంతో ఎస్సీ, ఎస్టీ కాలనీలో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. 12 చేతిపంపులకు గాను 4 చేతిపంపులు మాత్రమే పనిచేస్తుండటంతో వీటిపైనే జనం ఆధారపడి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు నీటి సరఫరా సక్రమంగా జరగాలంటే ఎస్సీ కాలనీ పైప్‌లైన్‌ వద్ద వాల్వును ఏర్పాటు చేస్తే నీరు సక్రమంగా సరఫరా అవుతుందని, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు దీనిపై దృష్టి సారించి వాల్వును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement