బెల్లంపల్లి : అభివృద్ధికి ఆదర్శంగా… సంక్షేమానికి నిదర్శనంగా… బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామపంచాయితీ నిలుస్తోంది. చంద్రవెల్లి సర్పంచ్ తాళ్లపల్లి అశోక్ గౌడ్ ఊరె తన ఇల్లుగా, ప్రజలే తన పిల్లలుగా, గ్రామాన్ని ఒక కుటుంబంగా కాపాడుతూ గ్రామాన్ని నిత్య సుందరంగా తీర్చిదిద్దడంలో తనకు తానే సాటి. రాష్ట్ర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ప్రతీ ప్రభుత్వ, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చేస్తూ, ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తూ స్వచ్చ చంద్రవెల్లిగా నిలుపుతున్నారు. గ్రామంలోని వైకుంఠ దామం, కంపోస్టు షెడ్డు, డంపింగ్ యార్డులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా ఏ గ్రామంలో లేని విదంగా గ్రామంలోని చంద్రవెల్లి, బీసీ కాలనీ, చంద్రవెల్లి ప్రకృతి వనాలను కార్తీక వనాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే తానే కార్మికుడై కార్మికులతో పాటు పనిచేస్తూ నిత్యం మొక్కలను చిన్న పిల్లల్లాగా కాపాడుతూ ప్రకృతి వనాలను చూస్తే పచ్చదనానికే 10 మెట్లు ఉన్నట్లు చేయిస్తూ అందరిని అబ్బుర పరుస్తున్నాయి. గ్రామంలో ఎలాంటి ఆపద వచ్చినా ఇంటికి పెద్దన్నలా ముందే ఉంటే ఆర్థిక సహాయాలను అందిస్తూ ప్రతీఒక్కరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. అదేవిధంగా యువత చెడుదారులు పట్టకుండా క్రీడలకు ప్రోత్సహిస్తూ, మహిళలు ఉపాది పొందేందుకు సహాయపడుతూ ప్రోత్సహిస్తున్నారు. రానున్న మరో రెండున్నర సంవత్సరాల్లో చంద్రవెల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 24 గంటలు ప్రజాసేవలోనే పని చేయాలన్నదే తన కోరిక అంటూ తెలుపడం జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement