మంచిర్యాల : కుల సంఘాల్లో ఎన్నుడు లేని విధంగా విశ్వబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర, జిల్లా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. మండల కేంద్రంలోని భారతీ విద్యానికేతన్‌లో నిర్వహించిన మండల ఎన్నికలు ప్రత్యక్షంగా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలను నిర్వహించారు. గత 15 రోజుల నుండి మండలంలో విశ్వబ్రాహ్మణ ఐక్య వేదిక నాయకులు కట్ట వెంకటేశ్వర్లు, నూతి శ్రీకాంత్, రాంబాబు, లక్ష్మీనారాయణ తదితరులు మండలంలోని వారి కులస్తులను ప్రత్యక్షంగా కలుస్తూ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులుగా పోటీ పడుతున్న కౌలె జగన్నాథం, శ్రీరాముల గంగాధర్‌లకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రచారం నిర్వహించారు. కాగా 506 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు సంతోష్‌కుమార్, బ్రహ్మయ్య, గంగారాంలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement