కాసిపేట: సరైనా రవాణ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరి గ్రామాల భాదలు తీరనున్నాయి. ముఖ్యంగా వానకాలం వాగులు పొంగి పారుతుండడంతో బయటి ప్రపంచంతో సంబందాలు తెగిపోయి, రోగం నొప్పి వచ్చిన దేవుడిపై బారం వేసే గూడాలకు మహార్దశ పట్టనుంది. కాసిపేట మండలం గట్రావుపెల్లి, చింతగూడ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ఎదుర్కొంటున్న భాదలు తీరిపోనున్నాయి. ముఖ్యంగా వాగు అవతలి గ్రామాలు కావడంతో వానకాలం వస్తే బిక్కు బిక్కు అంటూ వాగుల ఉదృతి తగ్గే వరకు వేచిచూడాల్సిన పరిస్థితి. జ్వరం వచ్చిన, తీవ్ర అనారోగ్యం వచ్చిన దాదాపు ఆరు కిలో మీటర్ల దూరంలో వున్న మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలనిన, గ్రామంలోకి 108 అంబులెన్స్ కాదు కదా ఆటో వచ్చేందుకు దారి లేక పరిస్థితి విషమించి రోగులు చని పోయిన సంఘటనలు వున్నాయి. గురువాపుర్ గ్రామంలో పురిటి నొప్పులు, ఆనారోగ్యంతో బాధపడుతున్న మహిలలకు సకాలంలో వైద్యం అందక మృతి చెందిన సంధర్భాలున్నాయి. ఆలాంటి గిరి గ్రామాలకు సమీపకాలంలో రవాణ సౌకర్యం మెరుగుపడనుంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక శ్రద్దతో నిదులు మంజూరు చేయించడంతో గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న బాదలు తొలగిపోనున్నాయి. ప్రదాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పతకం కింద రూ, 3.5 కోట్లతో దేవాపూర్ ఆర్ అండ్ బి రోడ్ నుండి చింతగూడ, గురువాపూర్, రేగులగూడెం మీదుగా దాదాపు 5 కిలో మీటర్లు రోడ్డు నిర్మాణంతో పాటు రేగులగూడెం, గురువాపూర్ గ్రామాల మద్య వున్న వాగుపై వంతెన నిర్మాణాలకు రూ, 3.05 కోట్ల నిదులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు మొదలు అవుతాయని నాయకులు పేర్కొన్నారు. ఏమైనా దశాబ్దకాలాలుగా గిరిజన గూడాలు కనీస రోడ్డు సౌకర్యం లేక, వాగులపై వంతెన నిర్మాణాలు చేపట్టక ఎన్నో భాదలు ఎదుర్కొన్న
గిరిజనులు, వాగులపై వంతెనలు, రేగులగూడెం మీదుగా గురవాపూర్, చింతగూడెం మీదుగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు ఇప్పించిన ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు అబినందనలు తెలియచేసుకుంటున్నారు. ఇన్నాల్లు సరైనా రవాణ సౌకర్యాలు లేక పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయని ఆనందాన్నిఅభిప్రయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
గిరి గ్రామాలకు మహార్ధశ..
Advertisement
తాజా వార్తలు
Advertisement