నిర్మల్ జిల్లా బైంసా పట్టణం మార్కెట్ లోని వీర్ హనుమాన్ ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. శనివారం రాత్రి దేవస్థానంలో హనుమాన్ దీక్షపరులు, భక్తులు హారతి నిర్వహించారు. హారతి కార్యక్రమం ముగించుకుని, హారతి కింద పెట్టిన 4 నిమిషాలు పాటు హారతి పళ్లెం కడలిందని భక్తులు అందరూ ఆశ్చర్యపోయారు. సాక్షాత్తుగా ఆ ఆంజనేయుడే హారతీ రూపంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించాడని అంటున్నారు.