Tuesday, November 19, 2024

ADB | ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లమ్మి లబ్ధిపొందాలి… ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

జన్నారం, నవంబర్ 19 (ఆంధ్రప్రభ): ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లమ్మి రైతులు లబ్ధిపొందాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రాంపూర్, తిమ్మాపూర్, తపాల్ పూర్, రోటిగూడ, పొనకల్, దేవునిగూడ, రేండ్లగూడ, మోర్రిగూడ, కవ్వాల గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేరువేరుగా ఎమ్మెల్యే టెంకాయలు కొట్టి మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. సన్నరకం వడ్లను కొనుగోలు కేంద్రంలో అమ్మినట్లయితే రూ.500.00 బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల శ్రేయస్సే ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు.

మండలంలోని కిష్టాపూర్ గ్రామ సమీపాన ఐటిఐ పక్కన రూ.20లక్షలతో నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి, ఎంపీడీఓ శశికళ, మండల వ్యవసాయశాఖ అధికారిణి సంగీత, పొనకల్, చింతగూడ పీఏసీఎస్ చైర్మన్లు అల్లం రవి, నాసాని రాజన్న, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం, పార్టీ సీనియర్ నేతలు మిక్కిలినేని రాజశేఖర్, ఎ.సుభాష్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, మచ్చ శంకరయ్య, కరుణాకర్, ఫసిఉల్లా, సుధీర్ కుమార్, లక్ష్మీనారాయణ, ఇందయ్య, నందునాయక్, రమేష్, గంగాధర్, అశోక్, హజార్, షాకీర్ ముజ్జు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement