జన్నారం, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పైడిపల్లి హనుమాన్ దేవాలయం వద్ద శనివారం గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ తెలిపారు.
మండలంలోని పైడిపల్లి టెంపుల్ వద్ద తనతో పాటు హెడ్ కానిస్టేబుల్ బి.తుకారాం,కానిస్టేబుల్ కొత్తూరి భాస్కర్ లు వాహనాలను తనిఖీ చేస్తుండగా మండలంలోని మహ్మదాబాద్‌కు చెందిన కెమెరా నగేష్, బెంబడి పవన్ మోటార్‌సైకిల్‌పై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. నిందితుల నుంచి 30 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని.. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.