చెన్నూర్ (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పరిసర ప్రాంతలలోని పత్తి మిల్లుల్లో ఏర్పాటు చేసిన సిసిఐ అధికారులు అమ్మకానికి వచ్చిన రైతుల పట్ల ఇష్టారాజ్యం గా వ్యాహరిస్తు కొనుగోలులో రోజుల తరబడి జాప్యం చేస్తున్నారని కోరుతూ స్థానిక జాతీయ రహదారి పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట చెన్నూరు పట్టణంలోని జిన్నింగ్ మిల్లులకు తీసుకువస్తే సందిత మార్కెట్ కమిటీ, సిసిఐ అధికారులు టోకెన్ల పంపిణీలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల నుంచి వహణలో పత్తి అమ్మకానికి తీసుకు వస్తె అధికారులు అనేక కారణాలు చెబుతు రోజుల తరబడి కొనుగోలు చేయక పోవడం తో వాహనాల వెయిటింగ్ చార్జిల ఆర్థిక నష్టం తో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉన్నత అధికారులు స్పందించి జిన్నింగ్ మిల్లుల వద్ద అధికారులు తమ పత్తి కొనుగోలులో జాప్యం చేయకుండా చూడాలని కోరారు.