తానూర్ : నేరాల అదుపునకే ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని ముదోల్ సీఐ వినోద్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలం లోని తొండల గ్రామంలో ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెంట్ తప్పకుండా ధరించాలని వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. చాలా మంది యువత ఆన్లైన్ మోసాలకు బలి అవుతున్నారని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామంలో హనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా సరైన పత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలు మరియు 8 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముధోల్ సీఐ వినోద్, తానూర్ ఎస్ఐ విక్రమ్ , లోకేశ్వరం ఎస్ఐ సాయికుమార్, ముధోల్ ఎస్ఐ తిరుపతి,బాసర ఎస్ఐ మహేష్ ,RSI మరియు ముధోల్ సర్కిల్ సిబ్బంది మరియు మొత్తం 70 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ సీఐ వినోద్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని మరియు సైబర్ క్రైమ్ గురించి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement