Friday, November 22, 2024

TG | సమస్యలపై ఫోరంకు ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కారం : చైర్మన్ రామకృష్ణ

జన్నారం, (ప్రభన్యూస్) : విద్యుత్ సమస్యలపై ఫోరంకు ఫిర్యాదులు చేస్తే తక్షణమే పరిష్కరించనున్నట్లు నిజామాబాద్ -2 తెలంగాణ ఉత్తర విద్యుత్ సంస్థ సి.జి.ఆర్.ఎఫ్ చైర్మన్ ఎస్.రామకృష్ణ అన్నారు. మంచిర్యాల జిల్లామండల కేంద్రంలోని రైతు వేదికలో లక్షేట్టిపేట సబ్ డివిజన్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్)ను బుధవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా 28 మంది వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, విద్యుత్తు వినియోదాలకు మెరుగైన సేవలు అందించడానికి ఫోరం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

విద్యుత్తు సమస్యలు ఉన్న వినియోగదారులు సమస్యను పోస్ట్ కార్డు,మెయిల్, వ్యక్తిగతంగా, వాట్సాప్ ద్వారా గాని పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడకూడదని,అందుకే సమస్యల పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నామని,పరిష్కార వేదికల ద్వారా సమస్యలన్నింటిని పరిష్కరించుకోవడానికి వీలవుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫోరం డైరెక్టర్లు ఎల్.కిషన్,ఎం.రాజగౌడ్, మంచిర్యాల ఎస్సీ శ్రవణ్ కుమార్,డిప్యూటీ ఈఈ కైసర్, లక్షేటిపేట ఏడిఈ ప్రభాకర్ రావు, ఎఎఓ యాదగిరి నరేందర్ రావు, స్థానిక సబ్ ఇంజనీర్ ఎన్. అజయ్ కుమార్,ఎఈఈలు ఖలీమ్, కొట్టి మల్లేష్,రాయనర్సు,గణేష్, స్థానిక ఉద్యోగులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement