Friday, November 22, 2024

ADB : మార్నింగ్ వాక్ లో సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

(ప్రభ న్యూస్) : ఉట్నూర్ పట్టణంలోని పలు కాలనీల్లో శుక్రవారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బోజ్జు పటేల్ మార్నింగ్ వాక్ చేశారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ పట్టణంలోని బోయవాడ, ఎన్టీఆర్ కాలనీ, హనుమాన్ నగర్, మేదరివాడ, మోబిన్ పురా కాలనీల్లో ఉదయం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్… పొద్దు పొడుపు-బొజ్జన్న అడుగు(మార్నింగ్ వాక్) కార్యక్రమం నిర్వహించారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను స్టానికులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాలనీల్లో ప్రధానంగా నీటి, డ్రైనేజీ, రోడ్డు, కరెంటు ట్రాన్స్పార్మర్ సమస్యలను గుర్తించడం జరిగిందని, ఈ సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన‌ కొన్ని నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం కింద 10లక్షల భీమా, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 లకే గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. త్వరలో ఇళ్ళు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. 4వేల పెన్షన్, మహిళలకు 2500 రూపాయలను ఇస్తామన్నారు. కేంద్రంలో అధికారంలో వస్తే 5న్యాయాలతో పాటు మరిన్ని పథకాల ద్వారా ప్రజలకు లబ్ది చేకురుస్తామన్నారు. అనంతరం పలువురిని పరామర్శించి, ఆరోగ్య బాగోగులను అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ లింగంపల్లి చంద్రయ్య పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యూం, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎగ్బాల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement