నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ప్రియురాలి మొజులో పడి భార్యను హత్య చేసిన భర్తకు జిల్లా జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు లైజన్ అధికారి సక్రియ నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని గాలి సింగ్ తండాకు చెందిన రాథోడ్ మనీష్ కి… మీరాబాయితో వివాహాం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరు భైంసాలోని ఓ రైతు వద్ద వ్యవసాయ కూలీ పని కోసం వచ్చారు. ఈ క్రమంలో పాండ్రిగల్లీకు చెందిన ఓ ఆమెతో మనీష్‌కు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరువురి విషయం భార్య మీరాబాయికి తెలియగా.. పంచాయతీ సైతం జరిగింది. ఈ పంచాయతీలో మీరాబాయితో పాటు ప్రేమికురాలిద్దరితో కలిసి ఉండాలని నిర్ణయించారు.
కొద్ది రోజుల తర్వాత ఇద్దరు భార్యల మధ్య గొడవలు జరుగగా.. రెండో భార్య, భర్త మనీష్ ఇద్దరు కలిసి మొదటి భార్య మీరాబాయిని హతమార్చేందుకు ప్లాన్ చేశారు. 2019 ఫిబ్రవరి 13న మొదటి భార్య మీరాబాయిని.. మనీష్ ఆమె గొంతు నలిమి హతమార్చారు. మృతురాలి తండ్రి దత్తురాం జాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు పోలీసులు. ఇక సాక్షాధారాలతో నేరం రుజువు కావడంతో జిల్లా న్యాయమూర్తి కర్ణకుమార్ నిందితుడు రాథోడ్ మనీష్‌కు జీవిత ఖైదీతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు లైజన్ అధికారి సక్రియ నాయక్ తెలిపారు.