Thursday, January 9, 2025

ADB | అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు

ముధోల్, జనవరి 8 (ఆంధ్రప్రభ) : ముధోల్ మండల కేంద్రంలోని నయాబాదిలో బుధవారం అదుపుతప్పి ఆటో బోల్తా పడడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు… ముధోల్ నుండి అబ్దుల్లాపూర్ కు నాట్లు వేసేందుకు కూలీలందరూ ఆటోలో వెళుతుండగా, నయాబాదిలో కుక్క ఆటోకు అడ్డురాగా అదుపుతప్పి బోల్తా పడింది.

స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా, పది మంది బాధితులను బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరికి కాలు, మరొకరికి పక్కటెముకలు విరగినట్లు 108 సిబ్బంది తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement