జైనూర్, (ఆంధ్రప్రభ) కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పిట్టగూడ గ్రామంలో గురువారం జరిగిన గుస్సాడి దండారి సంబరాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మరుసుకోల సరస్వతి నాయకులు పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో ఆదివాసి మహిళలతో గుస్సాడీలతో అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మహిళలు రేలా రేలా సాంప్రదాయ నృత్యాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా గుస్సాడీ దండారి సంబరాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ రాబోయే తరాలకు సాంప్రదాయాలు తెలిసే విధంగా గుస్సాడీ దండారి ఉత్సవాలు ఎంతో కీలకమని అన్నారు.
ఈ వేడుకల్లో జై నూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత రావు, జైనూర్ సహకార చైర్మన్ కొడప అన్ను పటేల్, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేస్రం మోతీ రామ్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్, జైనూర్ ఎంపీటీసీల పోరం మాజీ మండల అధ్యక్షులు కుమ్ర భగవంతరావు, బిఆర్ఎస్ పార్టీ సిర్పూర్ (యు) మండల అధ్యక్షులు తొడసం ధర్మారావు, మాజీ సర్పంచులు అరక నాగోరావ్ ,ఆత్రం రాజేశ్వర్, ఆదివాసి సంక్షేమ పరిషత్ సిర్పూర్ మండల అధ్యక్షులు ఉరువేత జంగు, గ్రామ పటేల్ మేస్రం జంగు, నాయకులు అరక దుందేరావు, గేడం లక్ష్మణ్, మారు ఆదివాసీలు పాల్గొన్నారు.