Tuesday, November 26, 2024

వేతనాలు చెల్లించాలని నిరసన..

కాసిపేట : వేతన బకాయిలు చెల్లించాలంటూ హావర్లీ బేస్డ్‌ ఉపాధ్యాయులు తరగతులు బహిష్కరించి పాఠశాల ముందు నిరసన చేపట్టారు. కాసిపేట మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్ లో విదులు నిర్వహిస్తున్న బేస్డ్‌ భోదన సిబ్బంది, గత ఏడాది ఆగస్టు మాసం నుండి వేతనాలు చెల్లించడం లేదని భాదను వ్యక్తం చేశారు. కరోన నిబందనలు పాటిస్తూ ఆన్‌లైన్‌ తరగతులు, ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ప్రత్యక్ష తరతుల ద్వారా విధ్యార్థులకు పాఠాలు చెపుతున్నామని పేర్కొన్నారు. అయినప్పటికి నెల నెలా అందించాల్సిన వేతనాలు చెల్లింపులు చేయడం లేదని, దాంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, వేరే ఉద్యోగం చేసే వెసులుబాటు లేని హెచ్‌బీటి టీచర్ల ఆవేదన అర్థం చేసుకుని వేతనాలు మంజూరుచేసి ఆదుకోవాలని భోదన సిబ్బంది కోరుతున్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగమల్లయ్యకు, స్కూల్‌ యాజమాన్య కమిటి చైర్మన్‌ రాజేష్‌కు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement