Tuesday, November 26, 2024

ADB: ఎట్టకేలకు సర్వే ప్రారంభం…

కబ్జాచెరువులోనే మత్స్యకారుల నిరసన
జన్నారం, జూన్ 24 (ప్రభ న్యూస్): ఎట్టకేలకు కబ్జాకు గురైన చెరువు సర్వే ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ కబ్జాకు గురైన ఊర చెరువులో సోమవారం ఉదయం11 గంటలకు ఎట్టకేలకు సర్వే చేపట్టారు. ఆ చెరువు 30 ఎకరాల 12 గుంటల విస్తీర్ణంలో ఉంది. మండలంలోని కిష్టాపూర్, కొత్తూరుపల్లి, దేవునిగూడ, మన్నెగూడ, చర్లపల్లి గంగపుత్రుల, రైతుల సమక్షంలో జన్నారం డివిజన్ డిప్యూటీ ఈఈ వెంకటేశం, జేఈఈ రాజు, వర్క్ ఇన్స్పెక్టర్ మామిడి శంకర్, మండల సర్వేయర్ వల్లభనేని సురేష్, లైసెన్సుడ్ సర్వేయర్ దాముక సుధాకర్ లు సర్వే చేస్తున్నారు.

సర్వేలో చెరువు శిఖం, ఎఫ్.టి.ఎల్ లెవెల్ హద్దులు నిర్ణయించి హద్దురాళ్ళను పెట్టనున్నారు. ఈ సందర్భంగా చర్లపల్లి మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు తోకల నర్సయ్య మాట్లాడుతూ….. చెరువు శిఖం, ఎఫ్.టి.ఎల్ లెవెల్ లో హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. శిఖం భూమిలోని పట్టాలన్నింటినీ రద్దు చేసే వరకు చెరువులోనే తమ ధర్నా చేస్తూ నిరసన కొనసాగుతుందన్నారు. చెరును కాపాడుకోవడమే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement