జన్నారం, నవంబర్ 20 (ఆంధ్రప్రభ): జర్మనీ ప్రతినిధులు పత్తి పంటపై అధ్యయనం చేసేందుకు మంచిర్యాల జిల్లా జన్నారంకు వచ్చారు. జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్టులో జర్మనీ 16మంది ప్రతినిధులు బసచేశారు. జర్మనీ దేశానికి చెందిన 16 మంది ప్రతినిధులు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పత్తి పంటపై అధ్యయనం చేయడానికి వచ్చారు.
వారందరూ స్థానిక హరిత రిసార్ట్ లో బస చేసి బుధవారం ఉదయం ఇక్కడి నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ ప్రాంతానికి వెళ్లారు. ఆ ప్రాంతంలోని పత్తి పంటను పరిశీలించి, ఆ పత్తిని ప్రతినిధులు కొనుగోలు చేసి చెన్నై ద్వారా జర్మనీ దేశానికి తరలించనున్నారు. హరిత రిసార్ట్ సేవల పట్ల ఆ ప్రతినిధులు ప్రశంసించారు. వారందరికీ హరిత రిసాల్ట్ మేనేజర్ ఎస్.వీరేంద్రకుమార్ ఉదయం వీడ్కోలు పలికారు.
- Advertisement -