Friday, October 18, 2024

ADB: ప్రభుత్వ స్కూల్లో చదివి.. విక్రమార్కునిలా పోటీ పరీక్షలతో కుస్తీ..

దండేపల్లి, అక్టోబర్ 13(ఆంధ్రప్రభ): తండ్రి చిన్నతనంలోనే చనిపోయినప్పటికీ దిగులు చెందకుండా తల్లి ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదివి, తర్వాత ఎలాంటి ఫీజులు లేకుండా మంచి ర్యాంకులతో ఉన్నత చదువులు చదువుకొని పోటీ పరీక్షలతో పట్టు వీడని విక్రమార్కునిలా కుస్తీపడి రాష్ట్ర రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరుగా ఉద్యోగానికి ఎంపికైన అతనే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి వాసి కొట్టెతిరుపతి, పద్మ దంపతుల కుమారుడు కొట్టె మధుకర్.

అతను చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పైకివచ్చాడు. మధుకర్ తండ్రి చిన్నతనంలోనే 2002లో చనిపోయారు. తర్వాత తల్లి ప్రోత్సాహంతో అతను తీరిక సమయంలో పనులు చేసుకుంటూ, ఎంతో కష్టపడుతూ, ఒకటి నుంచి 10వ తరగతి వరకు అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు.

మెకానికల్ డిప్లమా చేసి, హైదరాబాదులోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ మెకానిక్ 2021లో పూర్తి చేశారు. 2018 లోని రైల్వే ఏఎల్పి లో కో పైలట్ పరీక్ష రాసి ఎంపికయ్యాడు. ఆ పోస్టులో చేరలేదు. ఆ తర్వాత 2023లో శ్రీహరికోటలోని ఇస్రోలో టెక్నికల్ ఆఫీసరుగా ఉద్యోగం సాధించారు. అతను ప్రస్తుతం అదే ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందక టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పరీక్ష రాశారు. ఆ పరీక్షలో మంచి మార్కులు సాధించారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఎంపిక జాబితాను ప్రకటించింది. మధుకర్ ఆ ఎంపిక జాబితాలో రాష్ట్ర రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మిత్రులు, బంధువులు అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement