బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఈరోజు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 800 మంది విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ముందు బైఠాయించారు. ముఖ్యమంత్రి వచ్చే వరకు ధర్నా ఆపేది లేదని విద్యార్థులు తెగేసి చెప్పారు. వర్సిటీలో ఇక్కడే ఉండే వ్యక్తినే వీసీగా నియమించాలని, అధ్యాపకుల పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అలాగే ల్యాప్‌టాప్‌లు, మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement