భైంసా : రోజు ఎక్కడో ఒకచోట అంగన్వాడి గుడ్లు అమ్ముకుంటున్నట్లు లేదా పక్కదారి పడుతున్నట్లు వింటూనే ఉన్నాం. వీటిని నియంత్రించడానికే అనుకుంటా అంగన్వాడి గుడ్లకి స్టాంపు వేసి సెంటర్స్ కి తరలించే కార్యక్రమానికి పూనుకున్నారు. గురువారం బైంసా అర్బన్ లో గల అంగన్వాడి కేంద్రాల్లో స్టాంపు వేసిన గుడ్లు సెంటర్స్ లో ప్రత్యక్షమయ్యాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
గతంలో జిల్లాల వారిగా ఎగ్ సప్లై కాంట్రాక్టర్స్ ఉండగా, ప్రస్తుతం జూలై మాసం నుండి జోనల్ వారీగా ఎగ్ కాంట్రాక్టర్లను నియమించారు. ఈ మేరకు “అంగన్వాడి గుడ్డు తెలంగాణ ప్రభుత్వం” సంబంధిత జోన్ నెంబర్ వేసి ప్రతి నెలలో మొదటి బ్యాచ్ గుడ్లకి నెమలి నీలం, రెండవ బ్యాచ్ గుడ్లకి రెడ్ కలర్, వేసవికాలం దృష్ట్యా మూడవ బ్యాచ్ గుడ్లకి గ్రీన్ కలర్స్ లో స్టాంపింగ్ వేసి ఉంటుందని ఇన్చార్జి సి.డి.పి.ఓ నాగలక్ష్మి తెలిపారు.