Friday, November 22, 2024

ఎస్టీ జాబితాలో మాలీలు..

భీమిని : అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మంచిర్యాల జిల్లా మాలీ సంఘం అధ్యక్షుడు చెండె సత్యనారాయణ అన్నారు. భీమిని మండల కేంద్రంలోని బీసీ కాలనీలో మాలీ కులస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికి నెరవేరలేదని, మాలీ కులస్తులు అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారని, అన్ని రంగాల్లో వెనుకబడిన మాలీ కులస్తులకు ప్రభుత్వం చేయూతను అందించి అన్ని రంగాల్లో ముందుండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అనంతరం జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాలీ కులస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భీమిని మండల సంఘాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మోర్లె వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి కొట్రంగి సుధాకర్‌, ఉపాధ్యక్షునిగా చౌదరి శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శిగా కొట్రంగి రవి, ప్రచార కార్యదర్శిగా మోర్లె బిక్షపతి, కోశాధికారిగా వశాక మహేందర్‌, కార్యవర్గ సభ్యులు మోర్లె బాపుమేర, లస్మయ్య, శ్రీహరి, చందు, గణేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కొట్రంగి శ్రీనివాస్‌, వెంకటేష్‌, బాపుమేర, సుధాకర్‌, రాజుమేర, మాలీ కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement