Friday, November 22, 2024

శ్రీరాంపూర్‌ ఏరియా వార్షిక లక్ష్యం..

శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్‌ ఏరియా వార్షిక లక్ష్యం రూ.6.85లక్షల టన్నులుగా నిర్దేశించిన శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం ఎం.సురేష్‌ తెలిపారు. శ్రీరాంపూర్‌ ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ యేడు కోవిడ్‌-19 వల్ల 51 రోజులు లాక్‌డౌన్‌ ఉండటం వల్ల 73 శాతం ఉత్పత్తి సాధించామని అన్నారు. సింగరేణి లక్ష్యం 50 మిలియన్‌ టన్నులు కాగా 55 శాతం సాధించామని అన్నారు. శ్రీరాంపూర్‌ ఏరియాలో భూగర్భ గనుల ద్వారా 1,61,500 టన్నులు కాగా 1,70,308 టన్నుల ఉత్పత్తితో 105 శాతం సాధించామని అన్నారు. బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడటం వల్ల ఏరియాలో 3లక్షల బొగ్గు నిల్వగా ఉందని అన్నారు. శ్రీరాంపూర్‌ ఏరియాలో 6 కొత్త ఎస్‌డీఎల్‌ యంత్రాలను గనులకు కేటాయించామని అన్నారు. కరోనా నివారణకై ఇప్పటి వరకు 118 మందికి కోవిడ్‌ టీకాలు ఇప్పించామని పేర్కొన్నారు. నూతన ఆర్థిక సంవత్సరంలో కార్మికుల సంక్షేమ కార్యక్రమాలతో పాటు సీఎస్‌ఆర్‌ నిధులతో అభివృద్ధి పనులు, సేవా సమితీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్‌ గోవిందరాజు, డీజీఎం ఐఈడీ చిరంజీవులు, పీఎం తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement