Friday, November 22, 2024

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు..

బెల్లంపల్లి: యువకులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. బెల్లంపల్లి మండలంలోని చాకెపల్లి గ్రామంలో జరుగుతున్న రఘుపతిరావు స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మండలంలోని అన్ని గ్రామాల నుండి టీమ్‌లు వచ్చి పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని, క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రీడలను నిర్వహించడం జరిగిందని అన్నారు. మారుమూల గ్రామాల్లో క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని అన్నారు. అనంతరం చాంపియన్‌గా నిలిచిన అంకుశం జట్టుకు రూ.75వేల నగదు, ట్రోఫీని, రెండవ స్థానంలో నిలిచిన చాకెపల్లికి రూ.40వేల నగదుతో పాటు ట్రోఫీని, నాల్గవ స్థానంలో నిలిచిన బట్వాన్‌పల్లి, పెర్కపల్లి గ్రామాలకు రూ.20వేల నగదుతో పాటు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఓబీసీ సెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బండి ప్రభాకర్‌, చాకెపల్లి ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు తొంగల మల్లేష్‌, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు సత్తయ్య, కాంగ్రెస్‌ నాయకులు విఘ్నేష్‌, జమ్మికుంట విజయ్‌, బండి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement