Tuesday, November 26, 2024

అద్భుత ప్రగతిలో సింగరేణి

కాసిపేట: 130 యేండ్ల సుధీర్ఘ కాలంలో సింగరేణి సాధించిన పురోగతి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలు, ఆలోచనల మేర యాజమాన్యం సంస్థను అభివృదిపై కార్మికులకు తెలియజేసేందుకు సమగ్ర సమాచార రూపంలో అధికారులకు అందించారు. 2013-14లో 50 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని తీసిన సంస్థ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015-16లో 15 శాతం వృద్ధిరేటులో 60 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని సాధించి దేశంలోనే నెంబర్‌-1 కంపేనీగా అభివృద్ధిని సాధించినట్లు, భవిష్యత్‌ వారాస విస్తరణలో భాగంగా 1200 థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభం చేసుకొని ఉత్పత్తిని తీయడంతో పాటు కొత్త ఆలోచనలతో 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ల ఏర్పాటుతో కరెంట్‌ ఉత్పత్తి తీయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు ఇప్పటికే కొన్ని ఏరియాల్లో కరెంట్‌ ఉత్పత్తిని తీస్తున్నట్లుగా పర్కొన్నారు. దాంతో పాటు ఇతర రాష్ట్రాల బొగ్గు గనుల ఏర్పాటుతో బొగ్గు ఉత్పత్తిని లక్షంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఒరిస్సా నైనీ బ్లాక్‌ నుండి ఈ యేడాది చివరి నాటికి 10 లక్షల టన్నుల బొగ్గు గనుల ఉత్పత్తిని తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇవే కాకుండా కార్మికుల అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాలు, లాభాల వాటా పెరుగుదల, రైల్వే లైను, కొత్త గనుల ఏర్పాటు, బొగ్గు అమ్మకాలు తదితర వివరాలతో సంక్షిప్త సమాచారాన్ని బుక్‌లో పొందు పరిచారు. దీంతో కార్మికులకు సంస్థ యొక్క పరిస్థితులు పూర్తి స్థాయిలో తెలియ వస్తుందని కార్మికులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement