కాసిపేట : కరోనా మహమ్మారి దిన దినం విస్తరిస్తున్న నేపధ్యంలో సింగరేణి యాజమాన్యం గనులు, డిపార్డ్మెంట్లలో కరోనా వ్యాధిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో అండర్‌గ్రౌండ్ గనుల్లో లేఆప్ అమలుచేసిన యాజమాన్యం ఈ కరోనా రెండవ వేవ్‌లో ప్రభుత్వాలు లాక్డౌన్ అమలుచేసేది లేదని తేల్చి చెపుతుండడంతో కార్మికుల్లో కోవిడ్ నిబంధనలపై కార్మికులకు అవగాహణ కల్పిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్షాలను సాధించే ప్రయత్నాలను తీవ్రం చేసింది. గత ఏడాది అనుకున్న బొగ్గు ఉత్పత్తి లక్షాలు సాధించకపోవడంతో ఆ అనుభవాలను పరిగణలోకి తీసుకుని 2021-22కు లక్షంగా పెట్టుకున్న70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు కార్మికులు, అధికారులను మానసికంగా సిద్దంచేస్తోంది. అయితే కరోనాను అడ్డుకునేందుకు కార్మికులకు ఆసుపత్రుల్లో పరీక్షలు, పాజిటివ్ వచ్చిన కార్మికులకు మెరుగైన వైద్యం, 12 రోజులు వేతనంతో కూడిన ప్రత్యేక సెలవు, కరోనా వ్యాక్సిన్ ఇలా పలు అవకాశాలు కల్పిస్తోంది. మరో వైపు గనులపై సమావేశాలు ఏర్పాటు చేయడం, ఏ కార్యక్రమం జరిగిన కరోనాపై అవగాహణ కల్పిస్తున్నారు. మాస్క్ ధరించిన కార్మికులకు ఇన్మాస్టర్, శానిటైజర్ అందుబాటులో పెట్టడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు అందించడం, గనులు, డిపార్టమెంట్లపై సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి లాంటి పలుచర్యలను అమలు చేస్తోంది. గనిలో జ్వరం, జలుబు,దగ్గులాంటి రోగలక్షణాలు కనిపిస్తే వెంటనే అంబులెన్స్‌లో అసుపత్రికి తరలించి వైద్యం అందించడం ఇలా కరోనా కట్టడికి పలు విధాల ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రభుత్వం రాత్రి కర్ప్యూ అమలులోకి తీసుకురావడంతో రెండవ బదిలి, రాత్రి బదిలీ కార్మికులు తప్పని సరిగా తమ వెంట ఐడెంట్ కార్డ్, ఆధార్ కార్డ్ వెంట తీసుకురావాలని, రాత్రుల్లు పోలీసు శాఖ తనిఖి సందర్భంగా కార్మికులు ఇబ్బందిపడకుండా వుంటుందని, మూడు రోజులు విధులకు హాజరు కాని ఉద్యోగులు కరోనా పరీక్షలు చేయించుకుని డ్యూటికి రావాలనే నిబంధనలు తీసుకువచ్చారు. ఎప్పటికపుడు సంస్థలో పని చేసే ఉద్యోగుల ఆరోగ్యం పట్ల, కరోనా అడ్డుకునేందుకు యాజమాన్యం సరికొత్త అలోచనలు చేస్తుండడం దానికి ఉద్యోగులు, కార్మిక సంఘాల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుండడంతో కరోనా ఉదృతి నుండి సంస్థను కాపాడుకోగలమనే నమ్మకం యాజమాన్యానికి కలగడంతో అనుకున్న వార్షిక బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌ను సాధించగలమనే విశ్వాసంతో వుంది. ఏమైనా ముందు ఆరోగ్యం ఆ తర్వాతే ఏదైనా అనుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విధులకు హాజరుకావల్సిన బాద్యత కంపెనీ ఉద్యోగులపై వుందని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement