Tuesday, November 26, 2024

వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

కాసిపేట : దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల కెల్ల సింగరేణి బొగ్గు కంపేనీని అగ్ర భాగాన నిలబెట్టేందుకు యాజమాన్యం ప్రణాళికలను సిద్దం చేసుకుంది. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్‌ విధ్యుత్‌, సోలార్‌ ఫవర్‌ ఉత్పత్తిని చేస్తూ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. భారీ లక్షాలనే పెట్టుకొని వాటిని అధిగమించే ప్రయత్నంలో పక్కా ప్రణాలికలతో సంస్థను యాజమాన్యం పరుగులు పెట్టిస్తున్నది. అందులో భాగంగానే వచ్చే నాలుగేల్లలో వంద మిలియన్‌ టన్నుట బొగ్గు ఉత్పత్తిని సాధించాలనే ఉద్దేశంతో కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ప్రస్తుతం సింగరేణిలో 26 భూగర్భ, 20 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా 2020-21కి 60 మిలియన్‌ టన్ను బొగ్గు లక్షంగా పెట్టుకుంది. అయితే భవిష్యత్‌ పరిశ్రమల డిమాండ్‌ మేర బొగ్గు సరఫరాకు ప్రస్తుత ఉత్పత్తి సరిపోదని, నూతన బొగ్గు గనుల ఏర్పాటుతో అది సాధ్యం అని తలిచింది. ఈ నేపథ్యంలోనే రాబోయే ఐదేళ్లలో అనుమతుల కోసం ఉన్న నాలుగు గనులతో పాటు 14 నూతన గనులను ఏర్పాటు చేయాలని, పాత, కొత్త గనుల నుండి వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్షాన్ని సాధించాలనే భారి లక్ష్యంతో యాజమాన్యం ఉంది. వీటిలో నుండి తొలిధశలో 11 కొత్త గనులు వచ్చే నాలుగేల్లో జిటికే ఓసిపి, వికే ఓసిపి, జిడికే 10 ఓసిపి, గోలేటి ఓసిపి, వెకటాపూర్‌ ఓసిపి, రోంపెడ్‌ ఓసిపి, తాడిచర్ల ఓసిపిఇ, ఎంకెవి ఓసిపి, ఒరిస్సా రాష్ట్రంలోని నైని, న్యూ పాత్రపాద గనులకు అన్ని అనుమతులు పొంది త్వరగా బొగ్గు ఉత్పతిని తీసి అనుకున్న వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 2025-26 వరకు సాదించేందుకు యాజమాన్యం ఉత్సాహంతో ఉంది. మరో వైపు నూతన గనుల ఏర్పాటుతో పాటు నిరుద్యోగ యువకులకు కంపెనీలో ఉద్యోగ అవకాశాలు సైతం మెరుగుపడతాయనే అభిప్రాయం ఉంది. ఏమైనా తెలంగాణకు కొంగు బంగారం సింగరేణి దేశ, రాష్ట్ర అభివృద్దిలో ప్రదాన భూమిక పోషిస్తూ, ఉన్నత లక్ష్యాల సాధన వైపు పయనిస్తుండటం సంస్థలోని ఉద్యోగులు, అధికారుకు గర్వకారణంగా పలువురు చెప్పుకోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement