Tuesday, November 26, 2024

అభివృద్ధిలో దూసుకుపోతోన్న సింగరేణి..

శ్రీరాంపూర్‌ : సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ అన్ని ప్రభుత్వరంగ సంస్థల కంటే ముందుగా అభివృద్ధి చెందుతూ దేశంలో రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకువస్తుందని ఏరియా జీఎం ఎం.సురేష్‌ పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌పి-3, 3ఏ, ఎస్‌ఆర్‌పి-1 ఇంక్లైన్‌ గనిలో 2021-22 ఆర్థిక సంవత్సర ఉత్పత్తి లక్ష్యాల గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ సీఅండ్‌ఎండి ఎన్‌.శ్రీధర్‌
దిశానిర్దేశంలో సంస్థ అభివృద్ధి చెందుతూ లక్ష్యాలను సాధిస్తుందని అన్నారు. ఏరియా వార్షిక లక్ష్యం, ఎస్‌ఆర్‌పి-3, 3ఏ, ఎస్‌ఆర్‌పి-1 ఇంక్లైన్‌ గని వార్షిక లక్ష్యాలను ప్రతీఒక్క ఉద్యోగికి తెలియజేసేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ యొక్క ఉత్పత్తి లక్ష్యం 70 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని, శ్రీరాంపూర్‌ ఉత్పత్తి లక్ష్యం 65 లక్షల టన్నులని, ఎస్‌ఆర్‌పి-3, 3ఏ గని వార్షిక లక్ష్యం 2.80లక్షల టన్నులని, ప్రతీ రోజు 921 టన్నులు, ఎస్‌ఆర్‌పి-1 ఇంక్లైన్‌ వార్షిక లక్ష్యం 1.50లక్షల టన్నులని, ప్రతీ రోజు 493 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆయన సూచించారు. ఉత్పత్తి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఒక్క ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకెఎస్‌ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌ రెడ్డి, ఎస్‌ఓటూ జీఎం కె.హెచ్‌.ఎన్‌.గుప్త, ఎస్‌ఆర్‌పి గ్రూప్‌ ఏజెంట్‌ విజయ భాస్కర్‌ రెడ్డి, ఏరియా ఇంజనీర్‌ కుమార్‌, ఎస్‌ఆర్‌పి-1, ఎస్‌ఆర్‌పి-3 గని మేనేజర్లు అజయ్‌కుమార్‌, రవికుమార్‌, డీజీఎం ఐఈ చిరంజీవులు, డీజీఎం క్వాలిటీ నూక రమేష్‌, ఫిట్‌ సెక్రటరి వై.తిరుపతి, ఆర్‌.గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement