Saturday, January 11, 2025

ADB | ట్రాఫిక్ నియయాల‌పై అవగాహన ఉండాలి… సీఐ సాయినాథ్

జైనథ్, జనవరి 11 (ఆంధ్రప్రభ) : జైనథ్ మండల కేంద్రంలో మోడల్ స్కూల్ పరిధిలో శుక్రవారం సాయంత్రం సిఐ డి.సాయినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, డ్రగ్స్ వ్యసనములు, మొబైల్ వాడకం, సైబర్ నేరాలు, హనీ ట్రాప్ వంటి సమస్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈసంద‌ర్భంగా సీఐ మాట్లాడుతూ… పిల్లల తల్లిదండ్రులకు బైక్ పైన హెల్మెట్ వాడకం, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడడం అటువంటివి చేయకూడదని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పమని సూచించామ‌న్నారు. ఇటువంటి వాటితో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్, ట్రైనీ ఎస్సై మధు కృష్ణ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాములు, మోడల్ స్కూల్ చైర్మన్ నాగమణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీరికి శాలువాలతో సన్మానం చేయడం జరిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement