Tuesday, December 3, 2024

ABD | రాష్ట్రస్థాయిలో కిష్టాపూర్ విద్యార్థికి ద్వితీయ స్థానం..

జన్నారం, (ఆంధ్రప్రభ) : ప్రజాపాలన ప్రజావిజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వేల్పుల నరేందర్ ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని నాంపల్లి ఆదర్శ ఆలియా ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు దేవసేన, రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య చేతుల మీదుగా ఫీల్డ్ ను, ప్రశంసా పత్రాన్ని నరేందర్ అందుకున్నారు.

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పునరుత్పాదక శక్తి వనరులు అనే అంశంపై ఆ విద్యార్థి నరేందర్ ప్రదర్శించిన దానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం వచ్చింది.

ఈ సందర్భంగా ఆ విద్యార్థిని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, జిల్లా సెక్టోరల్ అధికారులు సత్యనారాయణమూర్తి, చైదరి,శ్రీనివాసరావు,హెచ్.ఎం రాజన్న,అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ మంగ,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమలాకర్, గొవర్దనచారి,రాజన్న, బుచ్చిలింగం,తదితరులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement