Tuesday, November 19, 2024

ADB | స్కాలర్ షిప్ లు బిక్ష కాదు.. విద్యార్థుల హక్కు..

  • కలెక్టరేట్ ను ముట్టడించిన విద్యార్థులు
  • ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఏబీవీపీ ధర్నా.. కలెక్టర్ కు వినతి


ఆంధ్రప్రభ, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పెండింగ్ లో పేరుకుపోయిన స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత మూడేళ్లుగా స్కాలర్ షిప్ లు లేక, ఫీజు రియంబర్స్ మెంట్ రాక ఇంటర్, డిగ్రీ విద్యార్థుల చదువులు ఆగమ్య గోచరంగా మారాయని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.7,400 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోయాయని జిల్లా కన్వీనర్ అక్షయ్ అన్నారు.

ప్రైవేట్ విద్యా సంస్థలు తమకు ఫీజులు చెల్లించడం లేదని, విద్యార్థులను కాలేజీలోకి రానివ్వడం లేదని, పరీక్షలు రాయడానికి అనుమతించడం లేదని వారు వాపోయారు. జిల్లా నలుమూలల నుండి వందలాది మంది విద్యార్థులు కలెక్టరేట్ కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి పోస్టును కూడా వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. అనంతరం అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి సమస్యలు నివేదిస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కార్తీక్ ఎం మహేందర్, నిఖిల్, అక్షయ, శ్రావణి, పారా మెడికల్ విద్యార్థులు సైతం పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement