జైనూర్, (ప్రభన్యూస్) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాథోడ్ గణేష్ కుమారుడు రాథోడ్ సచిన్ నీట్ లో స్కోర్ 499 ర్యాంకు 882 ర్యాంకు సాధించారని సచిన్ తండ్రి గణేష్ రాథోడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో ఎంబిబిఎస్ సీట్ అలాట్మెంట్ అయిందని ఆయన తెలిపారు. తన కుమారుడు ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు జై నూర్ లోని కేరళ గ్రామర్ స్కూల్లో చదివాడని.. 8 నుండి 10వ తరగతి సీబీఎస్సీ వరంగల్ లో చదువుకున్నారని, సీబీఎస్ఈ లో 500 మార్కుల గాను 425 మార్కులు సాధించారని ఎస్ఎస్సి ఇంటర్ శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాదులో చదివి 1000 మార్కుల గాను 982 మార్కులు సాధించారని ఆయన తెలిపారు. తన కుమారునికి నీట్ లో ర్యాంకు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన తెలిపారు.
- Advertisement -