Friday, November 22, 2024

ADB: ఆర్టీసీ ఆవ‌ర‌ణంలో మొక్క‌లు నాటిన ఆర్టీసీ ఉద్యోగులు

అదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆర్టీసీ ఉద్యోగులు మొక్క‌లు నాటారు. ఆర్టీసీ రిజర్వేషన్ ఇంచార్జ్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ మొక్క‌లు నాటారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ఈచ్ వన్ ప్లాంట్ వన్: కాలుష్యం లేని వాతావరణంలోనే మానవ జీవితం కొనసాగుతుందన్నారు. టెక్నాలజీ ద్వారా ఎన్నో కంపెనీలు, వస్తువుల, సేవలు ఉత్పత్తి చేయడం ద్వారా కాలుష్యము కూడా ఏర్పడుతుందన్నారు.

కార్బన్ మోనాక్సైడ్ వాయువుల వలన కాలుష్యం ఏర్పడి మనం పీల్చుకునే గాలిలో ప్రాణశక్తి తగ్గిపోయి మానసిక ఆందోళనలకు గురవుతున్నారన్నారు. మానసిక ఆందోళనలు పెరిగి వ్యాధులకు గురవుతారన్నారు. పర్యావరణం కాపాడుకోవడం అందిరి విధి అని, అందుకే “ఈచ్ వన్ ప్లాంట్ వన్” నినాదంతో మొక్కలు నాటి దాని రక్షించి మనం ఆరోగ్యంగా వుందామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement