Wednesday, July 3, 2024

ADB: రూ.12లక్షల రైతుల వడ్ల డబ్బులు గోల్ మాల్…

సొసైటీ గేటుకు తాళం వేసి రైతుల ధర్నా..
జన్నారం, జులై 1 (ప్రభ న్యూస్): రైతులు వడ్లమ్మిన రూ.12 లక్షలు గోల్ మాల్ అయ్యాయని సొసైటీ గేటుకు తాళం వేసి సోమవారం రైతులు ధర్నా చేశారు. అయితే రైతులు ఆ డబ్బులను ఇన్చార్జి వాడుకున్నాడని ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా పొనకల్ సింగల్ విండో సొసైటీ పరిధిలోని బాదంపల్లి, చింతలపల్లి గ్రామాలకు చెందిన మోటపలుకుల కమలాకర్, భూమన్న, లక్ష్మణ్ తో పాటు 15 మంది రైతులు ఆ సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రంలో రూ.12 లక్షల వడ్లను రెండు నెలల క్రితం విక్రయించారు.

ఎంతకూ రైతుల వడ్ల డబ్బులు రాకపోవడంతో కార్యదర్శి రాజన్నను విచారించారు. ఆ డబ్బులు వేరే అకౌంట్ లో జమైనట్లు కార్యదర్శి చెప్పారని ఆ రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపి రైతులంతా తమ డబ్బులను ఇన్చార్జి రవి కాజేశాడని ఆరోపిస్తూ.. స్థానిక సొసైటీ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేశారు. ఆ కార్యాలయంలోనే ఉద్యోగులు ఉండిపోయారు. రైతులకు పోలీసులు ఎంత నచ్చజెప్పినప్పటికీ వినలేదు.

ఈ కార్యక్రమంలో నేతలు దాసరి తిరుపతి, జనార్ధన్, ఆనందం, శ్రీనివాస్, మనోహర్ రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై సొసైటీ కార్యదర్శి కావటి రాజన్నను ప్రశ్నించగా, రైతుల డబ్బులు వాడుకున్నట్లు తమ దృష్టికి శనివారం వచ్చిందన్నారు. రైతులు తమకు ఫిర్యాదు చేసినట్లయితే డబ్బులు వారి అకౌంట్లో వేసేలాగా చూస్తామన్నారు. ఈ విషయమై ఇన్చార్జి గందొరి రవిని ప్రశ్నించగా… రైతుల వడ్ల డబ్బులు రూ.9 లక్షలు మాత్రమే తాను వాడుకున్నట్లు ఆయన చెప్పారు. ఆ డబ్బులు అన్నింటిని తిరిగి రైతులకు ఇస్తానని ఆయన చెప్పారు. రూ.12 లక్షల కాదని.. తాను తప్పు చేశానని ఒప్పుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement