Friday, November 15, 2024

TS: ప్రతి గూడేనికి రహదారి సౌకర్యం.. మంత్రి సీతక్క..

ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగాలను ఎన్నటికీ మరువం..
ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని, ప్రతి గిరిజన గూడేనికి రోడ్లు, వంతెన, రవాణా సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రామలింగంపల్లి గ్రామం నుండి శ్యామ్ నాయక్ తాండ వరకు రూ .3 కోట్ల 75 లక్షల వ్యయంతో చేపట్టిన తారు రోడ్డు, వాగుపై నిర్మించిన వంతెనను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజార్షి షాతో కలిసి సోమవారం ప్రారంభించారు.

ఏజెన్సీ పరిధిలోని ఆదివాసి గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రతి గూడేనికి రహదారి సౌకర్యం కల్పించి వారి సమస్యలు తీరుస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి సీతక్క ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి కోటి రూపాయల వ్యయంతో స్మారకవనానికి భూమిపూజ చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement