Sunday, November 24, 2024

RIP – ఆదివాసి ఉద్యమ నేత ఉయిక సంజీవ్ ఆకస్మిక మరణం

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయిక సంజీవ్ (53) ఆదివారం ఉదయం కన్నుమూశారు. బేల మండలం సాంగ్వి గ్రామానికి చెందిన ఉయిక సంజీవ్ గత దశాబ్ద కాలంగా ఆదివాసి గిరిజనుల హక్కుల కోసం, పోడు భూముల పట్టాల కోసం పలు ఉద్యమాలు చేశారు.

ఆదివాసి పేద గిరిజనులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఇటీవల జిల్లా కేంద్రంలో పలు ధర్నాలు, ఆందోళనలకు సంజీవ్ నాయకత్వం వహించారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవలే ఆసుపత్రిలో చేరిన సంజీవ్ పరిస్థితి విషమించడంతో ఆయన సొంత ఇంటికి తీసుకువచ్చారు. సంజీవ్ భార్య ఇందిర ఆదివాసి ఉద్యమ మహిళ సంఘం అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు.

- Advertisement -

సంజీవ్ అకాల మరణం పట్ల ఎంపీ గోడం నగేష్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు గూడెం గణేష్, నాయకులు నానాజీ, సిడం రామ్ కిషన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. సంజీవ్ మృతి ఆదివాసీ ఉద్యమాలకు, ముఖ్యంగా పేద గిరిజనులకు తీరనిలోటని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement