Friday, November 22, 2024

స్వీయ రక్షణతోనే కరోనా కట్టడి..

బెల్లంపల్లి : స్వీయరక్షణతోనే కరోనాను కట్టడి చేయవచ్చునని జిల్లా గ్రంథాలయాల చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌ అన్నారు. విలేఖరులతో మాట్లాడుతూ సెకండ్‌ వేవ్‌ కరోనా విజృంభిస్తూ ఎంతో మంది ప్రాణాలను బలికొంటుందని, ప్రతీ ఒక్కరు స్వీయ రక్షణ పాటిస్తూ భౌతిక దూరంతో ఉంటూ.. ఇంట్లో కూడా మాస్కు పెట్టుకొని ఉంటే కరోనాను కట్టడి చేయవచ్చునని అన్నారు. బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో డాక్టర్‌ అనీల్‌ రెడ్డి పర్యవేక్షణలో సేవలను అందించడం జరుగుతుందని, అందులో భాగంగా నేను కూడా 5 రోజుల పాటు బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో సేవలు పొందడం జరిగిందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో కరోనా కట్టడి కోసం జిల్లా కేంద్రంలో ప్రభుత్వవిప్‌ బాల్క సుమన్‌, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావులు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ కరోనా బాధితులకు ఆక్సిజన్‌, రెమిడెసివర్‌ టీకాలను అందుబాటులో ఉంచుతూ కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సెకండ్‌ వేవ్‌లో కరోనా విజృంభనలో ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ అనవసరంగా బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించి కరోనాను కట్టడి చేయాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement