Thursday, November 7, 2024

తెలంగాణ వచ్చాకే చెరువుల పునర్నిర్మాణం : ఎమ్మెల్యే బాపురావు

తాంసి, జూన్ 8 (ప్రభ న్యూస్) : ప్రత్యేక తెలంగాణ వచ్చాకే చెరువుల పునర్నిర్మాణం సాధ్యమైందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవపుర్ గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా చెరువు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మత్స్యకారులు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన దేవపూర్ గ్రామస్తుల ర్యాలీ అద్భుతమని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునర్నిర్మాణం చేసుకున్నామన్నారు. అదేవిధంగా చేపలను కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేసి మత్స్యకారులను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, మండల కన్వీనర్ వెంకటేష్, స్థానిక సర్పంచ్ ఫాతిమా -అబ్దుల్లా, నాయకులు మగ్గిడి ప్రకాష్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, కటిపెళ్లి శ్రీనివాస్ రెడ్డి, లచ్చంపూర్ సర్పంచ్ రాజేశ్వర్, బి ఆర్ ఎస్ నాయకులు దూస సంతోష్, ఎంపీటీసీ చంటి, లక్ష్మణ్, ప్రమోద్,చందు, సునీత రెడ్డి, పల్లవి, గంగాధర్, ఆశన్న యాదవ్, వెంకట్ రెడ్డి, ప్రశాంత్ వెంకన్న పోచ్చన్న, గజనన్, రమేష్, అశాకలి, జావిద్ ఖాన్, అశోక్, నారాయణ, పాండు, శెర్ల పోచ్చన్న, సత్యనారాయణ గార్లతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement