Tuesday, November 26, 2024

Bhimpur. : వానలు కురవాలని గ్రామదేవతలకు పూజలు

భీంపుర్.. వర్షాకాలం మొదలై సుమారుగా నెల రోజులు గడుస్తున్నా సరైన వర్షపాతం లేక రైతులు అయోమయంలో పడ్డారు. రాష్ట్రానికి ఋతుపవనాలు విచ్చేశాయని.. ఎలాగో వర్షాలు పడకపోతాయా అని రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నరు. విత్తనాలు విత్తుకున్నారు సరే.. వర్షాలు మాత్రం కురవడం లేదు. దీంతో రైతులు చేతులు నెత్తిన పెట్టుకొని ఆకాశం వైపు ఆశతో చూస్తున్నారు. పత్తి విత్తనాలు ఎక్కడ భూమి పాలు అవుతాయోనని రైతులు ఆవేదన చెందుతున్నరు.

వర్షాలు కురవాలని ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అందులో భాగంగానే మండలంలోని కరంజీ టీ గ్రామంలో గ్రామ దేవతలకు డప్పు చప్పులతో పెద్ద ఎత్తున మహిళలు తల బింద చేతబట్టి గ్రామ దేవతలకు నీలాభిషేకం చేసి… సకాలంలో వర్షాలు కురవాలని తమ పాడి పంట చక్కగా ఉండి గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement