Thursday, December 12, 2024

ADB | గిరిజన గ్రామాల్లో మౌళిక వసతులు క‌ల్పించండి.. ఎమ్మెల్యే బొజ్జు ప‌టేల్ విన‌తి

ఉట్నూర్, డిసెంబర్ 11 (ఆంధ్రప్రభ) : ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ‌ బొజ్జు పటేల్, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ ను మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమైనట్లు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు సమస్యల గురించి సమావేశంలో మాట్లాడడం జరిగిందని, అందులో ప్రధానమైన అంశాలపై చర్చించడమైంద‌న్నారు. వాటిలో గిరిజన ప్రాంత గ్రామాల అనుసంధానం కోసం రోడ్లు మంజూరు, గిరిజన గ్రామాల్లో మౌళిక వసతుల కోసం సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, కమ్యూనిటీ హల్స్ మంజూరు గురించి సర్వే పూర్తయిన అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు.

గిరి వికాస్ ద్వారా ఆదివాసీ రైతులందరికీ బోర్ వెల్స్, కరెంట్ మోటార్స్ మంజూరు గురించి, క్రీడా పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్, ఆట వస్తువులు మంజూరు చేయాలనీ, సీఆర్టీలకు టైమ్ స్కేల్ వేతనం ఇవ్వాలని సీఆర్టీ, ఏఎన్ఎంలకు దినసరి వర్కర్స్ పెండింగ్ వేతనాలు విడుదల చేయాల‌ని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రములు, పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రములు మంజూరు గురించి ఉట్నూర్ ఐటీడీఏలలోపూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని, పీసా కోఆర్డినేటర్ ల వేతనములు విడదల చేయాలన్నారు.

- Advertisement -

పీవీటీజీ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీని కోరినట్లు వారికి తెలిపారు. తాము తెలిపిన అంశాల గురించి కార్యదర్శి సానుకూలంగా స్పందించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించడమైనదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ‌ బోజ్జు పటేల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement