Saturday, November 23, 2024

గేయ రచయిత నుండి సిని నిర్మాతగా..

బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం గ్రామానికి చెందిన తైదాల బాపు సినీ గేయ రచయితగా రాణిస్తూ కోల్‌బెల్ట్‌ ప్రాంతం నుండి చలన చిత్ర రంగంలో చెరగని ముద్ర వేశారు. సినీ రచయిత నుండి నిర్మాతగా మారి బెల్లంపల్లి ప్రాంతంలో తాను చేపట్టిన ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ సినిమాన బెల్లంపల్లిలోనే మొదలు పెట్టి మంచిర్యాల జిల్లా ప్రాంతంలో చిత్రీకరించడం విశేషం. తాను పుట్టిన గడ్డ మీద సినిమా తీయాలన్న తన తపనకు మంచిర్యాల జిల్లాలోని పలువురు అతన్ని అభినందించారు. చదువుకునే వయసు నుండి పాటలు రాస్తూ చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక టీవి షోలో జరిగిన కార్యక్రమంలో తన ప్రతిభను చాటడంతో ఆయన ప్రతిభను చూసి పాటలను రాయించారు. ఇప్పటికి తైదాల బాపు 431కి పైగా అనేక ప్రముఖ హీరోల సినిమాల్లో పాటలు రాస్తూ రోజు సినీరంగ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా 2003-04లో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో సన్నిహిత్యంగా ఉంటూ ఎన్నో ఉద్యమ పాటలు రాయడం జరిగింది. ప్రముఖుల చేతుల మీదుగా ఎన్నో అవార్డులు పొందారు. ఎంతో మంది వద్ద పనిచేస్తూ తాను కూడా గేయ రచయిత నుండి డైరెక్టర్‌గా మారి మంచిర్యాల జిల్లాలోని అందాలను సినీ రంగానికి పరిచయం చేయాలని ఆయన చేసిన కృషిని మంచిర్యాల ప్రజలు మర్చిపోలేరు. అంతేకాకుండా సినీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకొని మంచిర్యాల జిల్లాకు, ఇటు సింగరేణి ప్రాంతానికి పేరు తీసుకువచ్చిన తైదాల బాపు మరెన్నో శిఖరాలను అదిరోహించాలని ఆయన మిత్రులు, సన్నిహితులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement