Monday, November 25, 2024

వైద్యం కోసం గర్భిణి స్త్రీల ఆందోళన..

కాసిపేట : వైద్య పరీక్షలు చేయాలంటూ గర్భిణి స్త్రీలు ఆసుపత్రి యెదుట ఆందోళన చేపట్టారు. గంటలతరబడి ఆసుపత్రిలో వేచివున్న పట్టించుకున్నవారు లేరనే ఆరోపణలతో నిరసనకు దిగారు. కాసిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షల కోసం పలు గ్రామాల నుండి గర్భిణిలు వచ్చారు.అయితే ఎన్నో ఇబ్బందులు పడుతూ పలు పరీక్షల కోసం, మందులకై వచ్చి గంటల తరపడి ఎదురు చూసిన పట్టించుకున్న వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య పరీక్షలు చేసి అసరమగు మందులు, ఐరన్‌ టాబ్లెల్ట్స్‌, బలవర్దక మందులు, గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితి తదితర పరీక్షలు చేయించుకుందామని వస్తే వైద్య సిబ్బంది నిర్లక్షదోరణి బాదకుగురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక డబ్బులు ఖర్చుచేసి ప్రయివేట్‌ వైద్యం చేసుకోలేని నిరుపేద, మద్యతరగతి మహిళల పట్ల అందుబాటులో వున్న వైద్య సిబ్బంది వ్యవహారతీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటలతరబడి నిలుచోలేక, కూర్చోలేక పలు ఇబ్బందులు ఎదుర్కోన్నమన్నారు. గర్భిణి స్త్రీల వైద్యం పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షధోరణికి నిరసనగా ఆసుపత్రి యెదుట ఆందోళనకుదిగినట్టు మహిళలు పేర్కోన్నారు. ఆనంతరం వైద్యురాలు కిరణ్మయి మహిళలతో మాట్లాడారు. ఆసుపత్రిలో సరియైన సిబ్బంది అందుబాటులో లేరని దాంతోనే కొంత ఆలస్యమైందని, అందరికి తప్పకుండా వైద్య పరీక్షలు చేపట్టి, ఆవసరమగు మందులు ఇస్తామని చెప్పడంతో ఊరటచెందిన మహిళలు ఆందోళన విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement