Thursday, November 21, 2024

ADB: సామాజిక సేవలకు గుర్తింపు డాక్టరేట్ పట్టా అందుకున్న ప్రభాకర్

ఉట్నూర్, మార్చ్ 15 (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా ఉట్కూరు మండలం దంతనపల్లి పంచాయతీకి చెందిన
దాసండ్ల ప్రభాకర్ డాక్టరేట్ పట్టా పొందారు. దాసండ్ల ప్రభాకర్ ఎన్నో సంవత్సరాలుగా ఎన్జీవోలో పనిచేస్తూ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి హెచ్ ఎస్ సి యు యూనివర్సిటీ ప్రభాకర్ చేసిన సంఘ సేవ, సామాజిక సేవకు గుర్తించిన యూనివర్సిటీ ఆఫ్ హోలీ స్పిరిట్ క్రిస్టిన్ విశ్లేషించి గౌరవప్రదంగా ఆయనకి డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు.. హైదరాబాదులో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ప్రభాకర్ కు డాక్టరేట్ పట్టా పురస్కార్ అవార్డు అందించారు.

సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ప్రభాకర్ ప్రతి ఒక్కరికీ మానవ దృక్పథంలో తనవంతు సాకారం చేస్తూనే ఉంటారు. అటు చేతన సంస్థతో గిరిజన విధ్యారులకు విద్య పరంగా, సేంద్రియ రైతులకు, మహిళా రైతులకు అనేక రంగాల్లో సహాయాలు అందిస్తున్నారు. ఇవన్నీ గమనించిన హోలీ స్పిరిట్ క్రిస్టిన్ యూనివర్సిటీ విశ్లేషకులు దాదాపు 3 సం.లు విశ్లేషించి గౌరవప్రదంగా ఆయనకి డాక్టరేట్ పట్టాకు సరైన అర్హుడని ప్రకటించారు… హైదరాబాద్ కళాశాల అవారణంలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవం పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సేవలను గుర్తించి డాక్టరేట్ ఇవ్వ‌డం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఏజెన్సీ మండలాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ఈ అవార్డు పొందడం పట్ల ఆయన అభిమానులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement