రూ.3.15 లక్షల నిషేధిత పొగాకు స్వాధీనం..
ఆంధ్రప్రభ బ్యూరో ఆదిలాబాద్ : నిషేధిత గుట్కా, పొగాకు మత్తు పదార్థాల అక్రమ నిల్వలపై పోలీసులు దాడులు నిర్వహించి పది కంపెనీలకు చెందిన రూ.3.15 లక్షల విలువైన పొగాకు నిర్వహణను స్వాధీనం చేసుకున్నారు. అదిలాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని పొగాకు మత్తు పదార్థాలను ప్రజలకు విక్రయిస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. భారీ ఎత్తున పొగాకు సంచులను స్వాధీన పరుచుకున్నారు.
అర్ధరాత్రి జరిపిన దాడుల్లో పొగాకు నిల్వల కేసులో రిక్షా కాలనీకి చెందిన షేక్ అప్సర్ ను అరెస్టు చేశామని, మరో ఇద్దరు నిందితులు అక్రమ్, మన్సూర్ (బుక్తాపూర్) పరారీలో ఉన్నట్టు డీఎస్పీ జీవన్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ కేసును ఛేదించిన వారిలో రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై విష్ణువర్ధన్ ఉన్నట్టు డీఎస్పీ వివరించారు.