కాసిపేట, నవంబర్25 (ఆంధ్రప్రభ) : కాసిపేట మండలం మామిడిగూడెం గ్రామంలో ఇవాళ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం (కార్డన్ అండ్ సెర్చ్ ) నిర్వహించారు. గ్రామంలో వున్న ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ రిజిస్ట్రేషన్, వాటి యాజమానుల డ్రైవింగ్ లైసెన్స్ లు పరిశీలించారు. సరియైన పేపర్, నంబర్ ప్లేట్ లేని 39వాహనాలను గుర్తించి పైన్ విధించారు.
గ్రామస్థులతో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ… గుడుంబా తయారీ, అమ్మడం నేరమని, సైబర్ క్రైమ్, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ రూల్స్, కొత్త చట్టాలు, మూఢ నమ్మకాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నార్కొటిక్ డాగ్ సిబ్బందితో అనుమానం ఉన్న గంజాయి అమ్మకాలు, తాగే వారి ఇళ్లను, గుడుంబా తయారు చేసే స్థావరాల యందు తనిఖీలు నిర్వహించారు.
గ్రామంలో జ్వరాల బారినపడి బాధపడుతున్న నేపద్యంలో పరిసరాలు, ఇంటి ఆవరణలో శుభ్రత పాటించాలని గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట్, మందమర్రి, దేవాపూర్, రామకృష్ణాపూర్ పిఎస్ ల ఎస్ఐ లు, నార్కోటిక్ డాగ్ సిబ్బంది,పొలీస్ సిబ్బంది పాల్గొన్నారు.