Monday, November 18, 2024

ADB: ఫోన్ ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే కు.. బోజ్జు పటేల్ శ్రీకారం..

ఉట్నూర్, జూన్ 6 (ప్రభ న్యూస్) : ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యలను ఎమ్మెల్యేల పీఏలు రాసుకోవడం జరుగుతుంది. కానీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ‌ బోజ్జు పటేల్ గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకుని, వాటితో పాటు వినూత్న రీతిలో ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రజల నుండే తెలుసుకొని, ఆ సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వినూత్న రీతిలో “ఫోన్ ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే” అనే కార్యక్రమానికి ఉట్నూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ‌ ఉదయం శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఖానాపూర్, కడం, జన్నారం, పెంబి, దస్తురాబాద్, సిరికొండ మండలాల వివిధ గ్రామాలకు చెందిన గ్రామస్తులు, ఉద్యోగులు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న నీటి, రోడ్డు, డ్రైనేజీ, కరెంటు, మిషన్ భగీరథ, జీవో నంబర్ 3, ఫారెస్ట్, జీవో నంబర్ 317, భూమికి సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సిఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేదింటి బిడ్డయిన తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని అయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement