కన్నెపల్లి : మండలంలోని టేకులపల్లి గ్రామంలో భారత్ పెట్రోల్‌బంక్ విశాలి ఫిల్లింగ్ స్టేషన్‌ను భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జి కొయ్యల ఏమాజీ, మండల ఎంపీపీ మాదవరపు సృజన నర్సింగరావులు ముఖ్య అతిథిగా హాజరై పెట్రోల్‌బంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పెట్రోల్‌బంక్‌ను ఏర్పాటు చేయడం వల్ల కన్నెపల్లిలోని అందరికి పెట్రోల్, డీజిల్ అందుబాటులో వస్తుందని అన్నారు. బంక్‌లో ఎల్లప్పుడు నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌ను అందుబాటులో ఉంచాలని బంక్ యజమాని ఉప్పుల మోహన్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నర్సింగారావు, బీజేపీ నాయకులు కేశవరెడ్డి, గోవర్దన్, అజ్మీర శ్రీనివాస్, రాజులాల్ యాదవ్, రామన్న, అశోక్‌రావు, శనిగారపు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement